Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేవుడా.. దేవుడా... సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవాలి!!

indian players
, శనివారం, 4 నవంబరు 2023 (12:04 IST)
సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ భారత్ విజయపరంపర కొనసాగిస్తుంది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో విజయభేరీ మోగించింది. దీంతో సెమీస్‌కు బర్త్ ఖరారు చేసుకుంది. అయితే, ఈ టోర్నీలో భారత్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. వీటిలో ఒకటి సౌతాఫ్రికా, రెండోది నెదర్లాండ్స్ జట్టు. అయితే, ఆదివారం కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే మ్యాచ్‌లో భారత్ ఓడిపోవాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమాని దేవుడిని ప్రార్థిస్తున్నాడు. దీనికి కారణం.. సెంటిమెంట్. 
 
సాధారణంగా భారతీయులకు సెంటిమెంట్లు ఎక్కువనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పని చేయాలంటే మంచి ముహూర్తం, మంచి శకునం చూసి ప్రారంభిస్తారు. అలాంటిది విజయం సాధించాలంటే గతంలో ఏం జరిగిందో అదే రిపీట్ కావాలని కోరుకోవడంలో అతిశయోక్తి ఉండదు. 2011 వన్డే ప్రపంచకప్ ను టీమిండియా గెలిచింది. 
 
మళ్లీ అలాంటి ఫీట్ ప్రస్తుత ప్రపంచకప్‌లో రిపీట్ చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 2011లో కూడా లీగ్ దశలో భారత్ అన్ని మ్యాచ్‌లో గెలిచింది. కానీ దక్షిణాఫ్రికాపై మాత్రం ఓడిపోయింది. అందుకే ఇప్పుడు కూడా దక్షిణాఫ్రికాపై ఓడిపోవాలని.. అప్పుడు నాకౌట్‌కు ముందు జట్టులో ఏవైనా తప్పులు బయటపడటంతో పాటు సెంటిమెంట్‌గా కూడా కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు.
 
ప్రస్తుతానికి టీమిండియాలో ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. బ్యాటింగ్ విభాగంతో పాటు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. అయితే కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మనోళ్లు ఎలా ఆడతారో చూడాలి. 2019 ప్రపంచ కప్‌లో కూడా టేబుల్ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్‌పై ఓటమి చెందారు. ఈసారి అలా కాకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 
 
పాయింట్ల పట్టిక పరంగా నిలిచే కంటే ఒక ఓటమితో సెమీస్ ఆడితే పోయేదేమీ లేదని అంటున్నారు. అటు దక్షిణాఫ్రికాతో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. సూర్యకుమార్ స్థానంలో ఇషాన్ కిషన్, బుమ్రా స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడతారని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ తుది జట్టులో సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇద్దరూ ఉండాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : నేడు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ - కివీస్ బ్యాటింగ్