Webdunia - Bharat's app for daily news and videos

Install App

షమీతో కాపురం చేయలేను.. నెలకు రూ.10 లక్షలు భరణం చెల్లించాలి... జహాన్

భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీకి ఆయన భార్య నుంచి మొదలైన సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. షమీతో కలిసి జీవించేందుకు ససేమిరా అంటున్న హాసిన్ జహాన్ ఇపుడు నెలకు ఏకంగా రూ.10 లక్షల చొప

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (13:00 IST)
భారత క్రికెట్ జట్టు క్రికెటర్ మహ్మద్ షమీకి ఆయన భార్య నుంచి మొదలైన సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. షమీతో కలిసి జీవించేందుకు ససేమిరా అంటున్న హాసిన్ జహాన్ ఇపుడు నెలకు ఏకంగా రూ.10 లక్షల చొప్పున భరణం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 
 
వెస్ట్ బెంగాల్‌లోని అలిపోర్ జ్యుడీషియల్ మేజిస్ట్రట్ కోర్టులో షమీకి వ్యతిరేకంగా హసిన్ గృహ హింస నిరోధక చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉంది. ఇదే కోర్టులో ఆమె తాజాగా భరణం కోరుతూ మరో పిటిషన్ వేశారు. షమీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం మొదలు పెట్టిన తర్వాత అతడు భార్యకు రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఖర్చులకు ఇబ్బంది పడుతున్నట్టు ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
 
ప్రతియేటా రూ.100 కోట్లు సంపాదిస్తున్న షమీ నెలకు రూ.10 లక్షలు ఇవ్వడం భారం కాబోదన్నారు. కుటుంబ పోషణ చూసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉందని కనుక హసిన్‌కు రూ.7 లక్షలు, కుమార్తెకు రూ.3 లక్షల చొప్పున ప్రతీ నెలా ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను అన్ని విధాలుగా నష్టపోయాను. ఢిల్లీకి వచ్చి షమీ కోసం ఏడు రోజులు వేచి చూశా. కానీ, అతడు నా పట్ల ప్రవర్తించిన విధానాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. తను నా కుమార్తెను ఒక్కసారే కలిశాడు. అతడు ఎటువంటి బాధ్యతలు తీసుకోనేందుకు సుముఖంగా లేనందున నాకు మెయింటెనెన్స్ ఇప్పించాలి' అని ఆమె ప్రాధేయపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments