Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌతాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ - విరాట్ కోహ్లిని ఎందుకు పక్కనబెట్టారు?

Webdunia
శుక్రవారం, 1 డిశెంబరు 2023 (10:14 IST)
భారత క్రికెట్ జట్టు త్వరలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఇందుకోసం  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సౌతాఫ్రికాలో పర్యటించే జట్టు సభ్యుల పేర్లను ప్రటించింది. ఇందులో స్టార్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు లేరు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న వీరిద్దరిని ఎందుకు జట్టు నుంచి పక్కన బెట్టారన్న చర్చ క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. దీనికి బీసీసీఐ వివరణ ఇచ్చింది. 
 
వీరిద్దరూ స్వచ్ఛంధంగా విశ్రాంతి కోరారని తెలిపింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా టూరు‍‌లో ఆడబోయే పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ల నుంచి విరామం కావాలని బోర్డును అభ్యర్థించారని వెల్లడించింది. ఇక స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నాడని, ఫిట్నెస్‌ను బట్టి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలియజేస్తూ బీసీసీఐ ఒక ప్రకటనలో వివరించింది. కాగా దక్షిణాఫ్రికాలో జరగబోయే అన్ని ఫార్మాట్లకు టీమిండియా జట్లను బీసీసీఐ పురుషుల సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించిన విషయం తెల్సిందే.
 
టెస్టులకు భారత జట్టు : రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్. షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ కృష్ణ.
 
3 టీ20ల కోసం భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్), రవీంద్ర జడేజా (వి.సి), వాషింగ్టన్ రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
 
3 వన్డేలకు భారత జట్టు : రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments