స్వదేశంలో దాదాపు నెలన్నర రోజుల పాటు సాగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీ ముగిసింది. భారత్ భంగపాటుకు గురైంది. ఆస్ట్రేలియా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీలో గెలిచిన కంగారులు విశ్వ కప్‌తో పాటు.. భారీ నగదు బహుమతిని అందుకుంది.
ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోగా, ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రికార్డు స్థాయిలో ఆరోసారి ప్రపంచ కప్‌ను కంగారులు సొంతం చేసున్నారు. కాగా, ఈ విజయంతో ఆసీస్ జట్టుకు కళ్లు చేదిరే ప్రైజ్ మనీ లభించింది. విజేతగా నిలిచిన కమిన్స్ సేనకు రూ.33.31 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నారు.
అలాగే, రన్నరప్‌గా నిలిచిన భారత జట్టుకు రూ.16.55 కోట్లు అందజేస్తారు. సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలైన సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు రూ.6.66 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. లీగ్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.83 లక్షలు చొప్పున అందజేస్తారు.