Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్-వెస్టిండీస్‌ల మధ్య తొలి టీ-20.. 94 పరుగులతో కోహ్లీ అదుర్స్ (video)

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (17:55 IST)
భారత్-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టి 20 లో టీం ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లి భారీ అర్ధ సెంచరితో (94) రాణించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 
 
తదనంతరం భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన టీమిండియా… మూడో ఓవర్ రెండో బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 10 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 8 పరుగులు చేసిన రోహిత్ పెర్రి బౌలింగ్‌లో హేట్మేయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అ తర్వాత మరో ఓపెనర్ కెఎల్ రాహుల్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. 
 
ఇక విండీస్ బౌలర్ల పై ఎదురు దాడికి దిగిన రాహుల్  ఫోర్లు సిక్సులతో విరుచుకుపడ్డాడు. చెత్త బంతులను బౌండరీకి తరలిస్తూ… 37 బంతుల్లో అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో 4 సిక్సులు 5 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసాడు. 
 
ఇక కెప్టెన్ కోహ్లీ 35 బంతుల్లో అర్ధ సెంచరి పూర్తి చేసుకున్నాడు. ఆపై కోహ్లీ దూకుడు పెంచాడు. రాహుల్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన పంత్ వచ్చి రావడంతోనే సిక్స్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. శివం దుబేతో కలిసి కోహ్లి అదరగొట్టే స్కోర్ చేశాడు. 50 బంతుల్లో 6 సిక్సులు ఆరు ఫోర్ల సాయం 94 పరుగులు చేశాడు.

కెప్టెన్ కోహ్లికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా  కోహ్లీ చేసిన సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

తర్వాతి కథనం
Show comments