విరాట్ కోహ్లీ ఖాతాలో రెండు చెత్త రికార్డులు..

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (14:27 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో రెండు చెత్త రికార్డులు వచ్చి చేరాయి. ఆజాజ్ వేసిన బంతి బ్యాట్‌కు తాకినట్టు రీప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తొలుత ఫీల్డ్ అంపైర్, ఆ తర్వాత టీవీ అంపైర్ అవుట్‌గా ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడా నిపుణులు, మాజీ ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.
 
నిన్నటి డకౌట్‌తో కోహ్లీ టెస్టుల్లో రెండు చెత్త రికార్డులను మూటగట్టుకున్నాడు. అందులో ఒకటి.. కెప్టెన్‌గా టెస్టుల్లో పదిసార్లు డకౌట్ కావడం గమనార్హం. ఇంగ్లండ్ పర్యటనలో డకౌట్ అయిన కోహ్లీ 8 డకౌట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. 
 
తాజా డకౌట్‌తో అత్యధికసార్లు డకౌట్‌ అయిన ఇండియన్ కెప్టెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇక, ఓవరాల్‌గా చూసుకుంటే కివీస్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరుపై ఈ రికార్డు ఉంది. 
 
కెప్టెన్‌గా ఫ్లెమింగ్ 13 సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ రెండో స్థానంలో ఉండగా, మైఖేల్ అర్ధర్‌టన్, హాన్సీ క్రానే.. ధోనీతో కలిసి మూడో స్థానాన్ని పంచుకున్నారు. కోహ్లీ ఖాతాలో చేరిన మరో చెత్త రికార్డు.. స్వదేశంలో అత్యధికసార్లు డకౌట్ కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలులో ఇమ్రాన్ ఖాన్ మృతి? పాకిస్తాన్‌లో పుకార్లు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vanara: సోషియో ఫాంటసీ కథతో అవినాశ్ తిరువీధుల మూవీ వానర

Akhanda 2: అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్

Sapthami Gowda: సతీష్ నినాసం హీరోగా ది రైజ్ ఆఫ్ అశోక నుంచి పాట విడుదల

Renu Desai: రేణు దేశాయ్ నటిస్తున్న సినిమా 16 రోజుల పండగ

Samantha: యూఎన్ విమెన్‌ ఇండియాతో చేతులు కలిపిన సమంత

తర్వాతి కథనం
Show comments