Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్‌గా అజారుద్దీన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ

Webdunia
సోమవారం, 21 అక్టోబరు 2019 (20:36 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు సాగిపోతున్న కోహ్లీ.. తాజాగా మరో రికార్డును బ్రేక్ చేశాడు. మొన్నటికిమొన్న బ్రాడ్‌మెన్ రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ... ఇపుడు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి తన పేరిట లిఖించుకున్నాడు. 
 
కెప్టెన్‌గానే కాకుండా, ఒక ఆటగాడిగా కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే. నిలకడగా ఆడుతూ పరుగుల వరద పారిస్తూనే జట్టుకు కూడా చిరస్మరణీయ విజయాలన్నందిస్తున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెళ్తున్నాడు. టెస్టు క్రికెట్లో ప్రత్యర్థి జట్లను అత్యధిక సార్లు ఫాలోఆన్ ఆడించిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్ రికార్డును ప్రస్తుత కెప్టెన్ విరాట్ బ్రేక్ చేశాడు. 
 
సౌతాఫ్రికాతో మూడో టెస్టులో సౌతాఫ్రికాను ఫాలోఆన్ ఆడించడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. రాంచీ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు 335 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించడంతో సౌతాఫ్రికాని భారత క్రికెట్ జట్టు ఫాలోఆన్ ఆడిస్తోంది. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విరాట్ ఎనిమిది సార్లు ఫాలోఆన్ ఆడించాడు. అజారుద్దీన్(7), మహేంద్ర సింగ్ ధోనీ(5), సౌరభ్ గంగూలీ(4) ఫాలోఆన్ ఆడించిన జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పుణె టెస్టులోనూ డుప్లెసిస్‌సేన ఫాలోఆన్ ఆడి ఓడిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments