విరాట్ కోహ్లీ అదుర్స్.. 50 టెస్టులకు కెప్టెన్‌గా రికార్డు.. అయినా ధోనీనే టాప్ (video)

గురువారం, 10 అక్టోబరు 2019 (12:19 IST)
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన భారత రెండో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు 49 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డు సృష్టించగా.. ఆ రికార్డును కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించడం ద్వారా అధిగమించాడు.
 
అయితే అత్యధిక టెస్టు మ్యాచ్‌లకు కెప్టెన్సీ సారథ్యం వహించిన కెప్టెన్‌గా టీమిండియా కెప్టెన్ ధోనీ (60 టెస్టులతో) అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌తో  కోహ్లీ 50 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా రికార్డు సాధించాడు.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం భారత్ - సౌతాఫ్రికా రెండో టెస్ట్ : కోహ్లీ సేన బ్యాటింగ్