Webdunia - Bharat's app for daily news and videos

Install App

29 యేళ్ల వయసు.. 9 యేళ్ళ కెరీర్... 50 సెంచరీలు.. ఎవరు?

విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఫార్మెట్ ఏదైనా దూకుడే ఆయుధంగా ఎంచుకుని పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగి

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (10:36 IST)
విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్. ఫార్మెట్ ఏదైనా దూకుడే ఆయుధంగా ఎంచుకుని పరుగుల వరద పారిస్తున్న క్రికెటర్. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు సంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తాజాగా మరో సెంచరీని తన ఖాతాలో జమ చేసుకున్నాడు.
 
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో చేరాడు. 29 యేళ్ల వయసులో 9 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లోనే కోహ్లీ ఈ తరహా రికార్డును చేరుకోవడం అదో ప్రత్యేక రికార్డు కావడం గమనార్హం. 
 
వన్డేల్లో 32 సెంచరీలు... టెస్టుల్లో 18 సెంచరీలు... కలుపుకుని తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 50 సెంచరీలు పూర్తి చేసి.. ఇంకా సెంచరీల వేట కొనసాగిస్తున్నాడు. ఇన్‌స్టంట్‌ వన్డే ఫార్మాట్‌తో పాటు ట్రెడిషనల్‌ టెస్ట్ ఫార్మాట్‌లోనూ సెంచరీల మోత మోగిస్తున్నాడు.
 
శ్రీలంకతో ముగిసిన కోల్‌కతా టెస్ట్‌లోనూ కొహ్లీ సెంచరీతో చెలరేగాడు. అసలు సిసలు కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో భారత్‌ను పోటీలో నిలిపాడు. లక్మల్‌ బౌలింగ్‌లో కవర్స్‌ మీదుగా కొట్టిన సిక్సర్‌తో ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో 50 సెంచరీల క్లబ్‌లో ఎంటరయ్యాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 50 అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన 8వ బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
 
ఇప్పటితరంలో హషీమ్‌ ఆమ్లా తర్వాత ఇంటర్నేషనల్‌ క్రికెట్లో 50 సెంచరీలు చేసిన 2వ క్రికెటర్‌గా విరాట్‌ రికార్డ్‌ల కెక్కాడు. భారత క్రికెట్‌ గాడ్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్ టెండుల్కర్ తర్వాత 50 అంతర్జాతీయి సెంచరీలు సాధించిన భారత క్రికెటర్‌గా విరాట్‌ చరిత్ర సృష్టించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments