Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంబ్లీ భార్యను తాకరాని చోట తాకాడు.. బ్యాగ్‌తో బాదేసింది.. ఎవరు?

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా వార్తల్లో నిలిచారు. ఓ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన తనపట్ల బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర తివారీ (59) అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. తాకరాని చో

Webdunia
సోమవారం, 2 జులై 2018 (12:44 IST)
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా వార్తల్లో నిలిచారు. ఓ మాల్‌లో షాపింగ్‌కు వెళ్లిన తనపట్ల బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ తండ్రి రాజేంద్ర తివారీ (59) అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. తాకరాని చోట పదే పదే తాకాడని ఆండ్రియా ఆరోపించారు. అంతటితో ఆగకుండా రాజేంద్ర తివారీపై ఆండ్రియా దాడి చేసింది. ఈ ఘటన ముంబైలోని ఇనార్బిట్ మాల్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. షాపింగ్ కోసం ముంబైలోని ఇనార్బిట్ మాల్‌కు కాంబ్లీతో పాటు ఆయన సతీమణి ఆండ్రియా వెళ్లారు. ఆ సమయంలో రాజేంద్ర తివారీ ఆమె పట్ల అభ్యంతరకరంగా తాకాడని తెలిసింది. ఒకసారి తనను తగిలితే ఊరుకున్నానని, పదేపదే తాకరాని చోట రాజేంద్ర తివారీ తాకుతుండటాన్ని జీర్ణించుకోలేకపోయానని ఆండ్రియా ఆరోపించింది. 
 
అంతేగాకుండా కాంబ్లీతో పాటు ఆమె తివారీతో వాగ్వివాదానికి దిగింది. ఈ వాగ్వివాదం గొడవకు దారితీసింది. ఈ క్రమంలో ఆండ్రియా తన చేతిలోని బ్యాగ్‌తో రాజేంద్రను బలంగా బాదింది. ఆ సమయంలో రాజేంద్రతో పాటు అంకిత్, అతని సోదరుడు అంకుర్ కూడా అక్కడే ఉన్నారు. 
 
ఈ దృశ్యాలన్నీ అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనపై పోలీసులకు కాంబ్లీ, ఆండ్రియా ఫిర్యాదు చేశారు. రాజేంద్ర తివారీ కూడా కాంబ్లీ దంపతులు తమపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి మోహం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments