Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లుడు కాదు.. కీచకుడు : అత్తా.. నీ కూతురు కంటే నీవే అందంగా ఉన్నావంటూ వేధింపులు

కామంతో కళ్లుమూసుకున్న ఓ కామాంధుడు ఏకంగా పిల్లనిచ్చిన అత్తనే కామ కోర్కె తీర్చాలని డిమాండ్ చేశాడు. పైగా, నీ కుమార్తె కంటే నీవే అందంగా ఉన్నావంటూ అత్తను లైంగికంగా వేధించసాగాడు. అతని వక్రబుద్ధిని తెలుసుకున

Advertiesment
అల్లుడు కాదు.. కీచకుడు : అత్తా.. నీ కూతురు కంటే నీవే అందంగా ఉన్నావంటూ వేధింపులు
, శుక్రవారం, 29 జూన్ 2018 (13:23 IST)
కామంతో కళ్లుమూసుకున్న ఓ కామాంధుడు ఏకంగా పిల్లనిచ్చిన అత్తనే కామ కోర్కె తీర్చాలని డిమాండ్ చేశాడు. పైగా, నీ కుమార్తె కంటే నీవే అందంగా ఉన్నావంటూ అత్తను లైంగికంగా వేధించసాగాడు. అతని వక్రబుద్ధిని తెలుసుకున్న అత్త.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా పుత్తూరులో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
శ్రీకాళహస్త్రికి చెందిన కె.జాన్‌ అదే పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో అటెండెర్‌గా పని చేస్తున్నాడు. 2012లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, జాన్ వ్యసనాలతో పాటు అమ్మాయిలతో ఎంజాయ్ చేయసాగాడు. 
 
ఈ క్రమంలో కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. అదేసమయంలో శ్రీకాళహస్త్రి ఏరియా ఆస్పత్రిలో వైద్యం కోసం వచ్చిన ఒక రోగి సహాయకురాలి బంధువును లైంగికంగా వేధించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విచారణ చేసి జాన్‌ను సత్యవేడు ఆస్పత్రికి బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. 
 
అయినా అతని బుద్ధి మారలేదు. భార్యను మరింతగా వేధించసాగాడు. ఫలితంగా గత జనవరిలో పుట్టింటికి చేరింది. ఆ తర్వాత భార్య కోసం అత్తారింటికి వచ్చిపోతూ ఏకంగా అత్త నాగజ్యోతిపైనే కన్నేశాడు. నీ కుమార్తె కంటా నీవే చాలా అందంగా ఉన్నావ్ అత్తా అంటూ ఫోనులో అసభ్య పదజాలంతో దూషించడమేకాకుండా తన కామవాంఛ తీర్చాలంటూ వేధించసాగాడు. అల్లుడి చేష్టలు రోజురోజుకీ శృతిమించిపోవడంతో నాగజ్యోతి చీరాల పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 7వ తేదీన ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ నెల 11వ తేదీన నిందితుడు జాన్‌ను అరెస్టు చేశారు. 
 
కానీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు 18 రోజులుగా జైలులో ఉన్నాడని బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా సస్పెండ్‌ చేయకుండా అతడిని కాపాడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నాచెల్లెళ్లు.. అయినా ప్రేమించుకున్నారు.. చివరికి ఆత్మహత్యకు?