Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుబ్రమణ్యస్వామికి నాగుపాము రక్ష - చిత్తూరులో అద్భుతం

నాగుపాములు దేవుళ్ళకు రక్షణగా ఉంటాయా.. దేవుళ్ళ జోలికి వస్తే పగబడతాయా.. అది నిజమనే అనిపిస్తుంది. చిత్తూరు-చెన్నై జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తుండగా సుబ్రమణ్యస్వామి విగ్రహం బయటపడింది. విగ్రహం కనిపించగానే ఒక నాగుపాము వేగంగా అక్కడకు చేరుకుంది. విగ్రహం

Advertiesment
సుబ్రమణ్యస్వామికి నాగుపాము రక్ష - చిత్తూరులో అద్భుతం
, మంగళవారం, 26 జూన్ 2018 (13:36 IST)
నాగుపాములు దేవుళ్ళకు రక్షణగా ఉంటాయా.. దేవుళ్ళ జోలికి వస్తే పగబడతాయా.. అది నిజమనే అనిపిస్తుంది. చిత్తూరు-చెన్నై జాతీయ రహదారి విస్తరణ పనులు చేస్తుండగా సుబ్రమణ్యస్వామి విగ్రహం బయటపడింది. విగ్రహం కనిపించగానే ఒక నాగుపాము వేగంగా అక్కడకు చేరుకుంది. విగ్రహం పైకి ఎక్కి బుసలు కొడుతోంది. జెసిబితో రోడ్డు పనులు చేస్తుండగా అక్కడ పనిచేస్తున్న వారందరినీ గమనిస్తూ బుసలు కొడుతోంది. దీంతో కూలీలు పని మానేసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం దొరికిన చోటే భారీగా గుప్తనిధులు బయటపడ్డాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. 
 
ఇలాంటి సంఘటనే తమిళనాడులో మూడు నెలలకు ముందు జరిగింది. తమిళనాడు ప్రభుత్వం ఒక ప్రభుత్వాసుపత్రిని నిర్మించడానికి పనులు చేస్తుండగా ఇదేవిధంగా సుబ్రమణ్యస్వామి విగ్రహం కనిపించింది. ఆ తరువాత నాలుగురోజుల పాటు ఒక నాగుపాము విగ్రహం చుట్టూనే తిరుగుతూనే ఉంది. 
 
చివరకు పురావస్తు శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అక్కడ ఎలాంటి గుప్త నిధులు లేవని తేల్చేశారు. ఐదో రోజు నాగుపాము కూడా కనిపించకుండా పోవడంతో పురావస్తు శాఖ అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పనులను ప్రారంభించారు. కానీ చిత్తూరులో ప్రభుత్వ యంత్రాంగం ఏవిధంగా ముందుకు వెళుతుందోనన్నది ఆసక్తికరంగా మారుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శైలజ అందాన్ని ఫేస్‌బుక్‌లో చూసి మతిపోయింది.. భర్తకు విడాకులు ఇవ్వమంటే?