Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పామును పారతో రెండుగా నరికేశాడు... తల భాగాన్ని పట్టుకునే సరికి?

పాము పగబడుతుందని వినేవుంటాం.. అయితే ఈ పామును రెండుగా నరికేసినా వదిలిపెట్టలేదు. నరికిన వ్యక్తి ఒళ్లంతా విషమెక్కించింది. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జెరెమీ ర్యాడ్‌

Advertiesment
పామును పారతో రెండుగా నరికేశాడు... తల భాగాన్ని పట్టుకునే సరికి?
, శుక్రవారం, 8 జూన్ 2018 (11:07 IST)
పాము పగబడుతుందని వినేవుంటాం.. అయితే ఈ పామును రెండుగా నరికేసినా వదిలిపెట్టలేదు. నరికిన వ్యక్తి ఒళ్లంతా విషమెక్కించింది. ఈ ఘటన అమెరికాలోని హ్యూస్టన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జెరెమీ ర్యాడ్‌క్లిఫ్‌, భార్యతో కలిసి పెరట్లో పని చేసుకుంటున్నాడు. అంతలో ఆ పెరట్లోకి ప్రమాదకరమైన ర్యాటిల్‌స్నేక్ అనే జాతి పాము వచ్చింది. 
 
పామును చూసిన జెరెమీ తనకు అందుబాటులో వున్న పారతో పామును రెండుగా నరికేశాడు. దాన్ని బయట పారేయడానికి చేత్తో తలభాగాన్ని పట్టుకున్నాడు. అక్కడే జెరెమీకి చుక్కలు కనిపించాయి. అప్పటి వరకు కదలకుండా చచ్చినట్లుండిన పాము తల ఎగిరి అతని చేతిని పట్టుకుంది. అంతే పాములోని విషమంతా జెరెమీ శరీరంలోకి పాకింది. 
 
శరీరమంతా విషం వ్యాపించడంతో.. జెరెమీని హెలికాఫ్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. విషం విరుగుడుకు 26 డోసుల మందు ఇచ్చారు. తొలుత జెరెమీ బతకడని అందరూ అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా జెరెమీ కోలుకుంటున్నాడని వైద్యులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురజాడ మునిమనవడు జీతం పెంచిన ఏపీ ప్రభుత్వం