Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాన్నా.. కడుపునొప్పిగా ఉంది.. వచ్చి పక్కన పడుకో.. మూడేళ్ళపాటు కుమార్తెను?

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. మూడేళ్ళ పాటు కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు. కూతురు కడుపునొప్పి అని చెబుతున్నా వినిపించుకోని కామాంధుడు కమ్మీతో కొట్టి పక్కన పడుకో అంటూ బెదిరించేవాడు. ఈ విషయం ఎక్కడైన

Advertiesment
Father
, సోమవారం, 21 మే 2018 (15:45 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. మూడేళ్ళ పాటు కన్న కూతురిపై లైంగిక దాడి చేశాడు. కూతురు కడుపునొప్పి అని చెబుతున్నా వినిపించుకోని కామాంధుడు కమ్మీతో కొట్టి పక్కన పడుకో అంటూ బెదిరించేవాడు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ప్రాణ భయంతో మూడేళ్ళ పాటు నరకం అనుభవించి చివరకు తండ్రి చేస్తున్న దుశ్చర్యను పోలీసులకు తెలిపింది. ఆ తరువాత ఏం జరిగిందంటే..
 
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లికి చెందిన ఉమాపతి, అమ్ములమ్మ కుమార్తె లోకేశ్వరి. ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. గత మూడేళ్ళ నుంచి తండ్రి ఉమాపతి రోజూ తాగొచ్చి ఆమెను శారీరకంగా అనుభవించేవాడు. తల్లి అమ్ములమ్మకు ఎన్నోసార్లు విషయాన్ని చెప్పింది లోకేశ్వరి. తండ్రే కదమ్మా నేనేం చేసేది అని ఆమె తన నిస్సహాయతను తెలిపి సైలెంట్ అయిపోయింది. ఐతే ఉమాపతి తన తల్లిని ఇంట్లోనే చంపి సహజ మరణంగా చిత్రీకరించినట్లు లోకేశ్వరి చెబుతోంది. తన తల్లిని ఏ విధంగా చంపేశానో అదేవిధంగా నిన్నూ చంపుతాను. నేను చెప్పినట్లు విను అంటూ లోకేశ్వరిని తండ్రి బెదిరించి మూడు సంవత్సరాల పాటు ఆమెను అనుభవించాడు. తల్లి అమ్ములమ్మకు కూడా భర్త తప్ప వేరే దిక్కు లేకపోవడంతో కుమార్తెను కాపాడుకోలేకపోయింది.
 
తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని తన స్నేహితులకు చెప్పింది లోకేశ్వరి. స్నేహితుల సలహాతో చంద్రగిరి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఉమాపతిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లోకేశ్వరి చెప్పినదంతా వాస్తవమేనంటూ తల్లి అమ్ములమ్మ పోలీసులకు తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నేళ్లపాటు గమ్మునుండి రమణ దీక్షితులు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారబ్బా?