Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ ముందే.. భారత జట్టుకు భారీ షాక్..

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (18:10 IST)
టీ20 ప్రపంచకప్‌ ముందు భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా మారిందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున ఆడుతున్న వరుణ్‌..మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. 
 
పెయిన్‌ కిల్లర్‌ లేకుండా అతను బరిలోకి దిగే పరిస్థితి లేదు. దాంతో ప్రపంచకప్‌ కోసం అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒక వేళ వరుణ్‌ అందుబాటులో ఉండకపోతే అతని స్థానంలో చహల్‌ను జట్టులోకి తీసుకునే అంశం బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
 
అక్టోబరు 10 వరకు తుది జట్లలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వరుణ్‌.. ప్రస్తుత ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లతో సూపర్‌ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 30 ఏళ్ల ఈ మిస్టరీ స్పిన్నర్‌ టీమిండియా తరఫున 3 టీ20ల్లో 2 వికెట్లు, 27 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

తర్వాతి కథనం
Show comments