గత కొంతకాలంగా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2021 తరువాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలోవార్తలు రావడంతో ధోని అభిమానులు నిరాశ చెందారు. కాని ఆ వార్తలన్నీ అవాస్తవాలని తాజాగా ధోని చేసిన ప్రకటనతో అభిమానులు సంబురపడుతున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజాగా భారత క్రికెట్ అభిమానులకు తీపి కబురు చెప్పారు.
తన ఇంటర్నేషనల్ క్రికెట్ కి గుడ్ బై చెప్పడానికి స్వాతంత్ర్య దినోత్సవం కంటే మంచి రోజు లేదని భావించే 15ఆగష్టు 2020 న తన రిటైర్మెంట్ ప్రకటించానని.., కాని అదే నా వీడ్కోలు మ్యాచ్ గా భావించట్లేదని.. తన చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున.. చెన్నై స్టేడియంలో చెన్నై అభిమానుల మధ్య ఆడాలని అనుకుంటున్నానని అదే తన చివరి మ్యాచ్ అంటూ సోషల్ మీడియాలో ధోని ప్రకటన చేశాడు.
అన్ని అనుకున్నట్లు సజావుగా జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో చెన్నైలోనే తన చివరి మ్యాచ్ ఉంటుందని చెప్తూ తన రిటైర్మెంట్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేశాడు ధోని. దీంతో మిస్టర్ కూల్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ ని వచ్చే సీజన్ లో కూడా చూడబోతున్నామని కూల్ అయి సంతోషంతో సంబురాలు చేసుకుంటున్నారు