ఐపీఎల్-2021 మధ్యలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి టీమిండియా సారథి విరాట్ కోహ్లిని తొలగించనున్నారు. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గని అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పిస్తున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి పూర్తిగా విఫలం కావటం వల్లే ఫ్రాంఛైజీ ఈ నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు విరాట్ కోహ్లీ గత వారం ప్రకటించడం తెలిసిందే. అటు ఐపీఎల్‌లో వచ్చే సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
కెప్టెన్సీ బాధ్యతల కారణంగా ఏర్పడుతున్న ఒత్తిడి తన ఆటపై ప్రతికూల ప్రభావం చూపుతున్న కారణంగా కోహ్లీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వన్డేల్లో మాత్రం టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు క్రికెట్ కెరీర్‌ను విజయవంతంగా కొనసాగించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న చర్చ కూడా జరుగుతోంది.