Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌహతి స్టేడియంలో అనుకోని అతిథి

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (12:13 IST)
గౌహతి వేదికగా ఆదివారం రాత్రి భారత్‌ - దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతున్న సమయంలో అనూహ్య ఓ దృశ్యం కెమెరా కంటికి కనిపించింది. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ పూర్తయి ఎనిమిదో ఓవర్‌ మొదలు కాబోతున్న సమయంలో ఓ పాము జరజరా పాకుతూ స్టేడియంలోకి వచ్చేసింది.
 
దీంతో ఆటను ఆపేసి క్రికెటర్లలంతా ఆ పాము వైపే చూస్తుండిపోయారు. అభిమానులకు కూడా ఏం జరిగిందో వెంటనే అర్థం కాలేదు. మైదానంలోకి హుటాహుటిన పరుగు పెట్టిన సిబ్బంది పామును పట్టి బయటకు తీసుకెళ్లిపోయారు. మైదానంలోకి కుక్కలు రావడం సాధారణమే కానీ.. ఇలా పాము రావడం అనూహ్యం. దీంతో కాసేపు కెమెరాలన్ని దాని చుట్టూనే తిరిగాయి. 
 
ఇదొక్కటే కాదు మ్యాచ్‌లో నిర్వాహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. దక్షిణాఫ్రికా ఛేదనలో దీపక్‌ చాహర్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ తొలి బంతి వేసిన తర్వాత స్టేడియంలోని నాలుగు ఫ్లడ్‌ లైట్లలో ఒక ఫ్లడ్‌లైట్‌ ఆగిపోయింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. ఆటకు 18 నిమిషాలు అంతరాయం కలిగింది. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments