Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఎట్టిపరిస్థితుల్లోనూ ఫైనల్‌కు చేరదు : షాహిద్ ఆఫ్రిది

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (08:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, గురువారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌‍లో ఏ జట్టు గెలుస్తుందో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది జోస్యం చెప్పారు. భారత్, ఇంగ్లండ్ ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే, ఇంగ్లండ్‌కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. పైగా, భారత్‌ ఫైనల్‌లో అడుగుపెట్టే అవకాశమే లేదని జోస్యం చెప్పారు. దీనికి కారణం ఇంగ్లండ్ జట్టు కూర్పు చాలా బాగావుందని చెప్పాడు. పైగా, మైదానంలో రాణించే జట్టుకే గెలుపు అవకాశాలు ఉంటాయని ఆయన తెలిపారు. 
 
ఈ మ్యాచ్ ఫలితంపై ఆఫ్రిది ఓ టీవీతో మాట్లాడుతూ, నేటి మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం 60-65 శాతం ఆ జట్టుకే ఉందని అభిప్రాయపడ్డాడు. రెండు జట్లూ సమానంగా ఉన్నాయని, ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేశాయని చెప్పాడు. అయితే, తన ఆప్షన్ మాత్రం ఇంగ్లండ్‌కే అని చెప్పాడు. 
 
బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూస్తే ఇంగ్లండ్ మెరుగ్గా ఉందన్నాడు. అందువల్ల ఇంగ్లండ్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. పైగా, ఇరు జట్లకూ అది అత్యంత కీలకమైన మ్యాచ్ కావడం విజయం కోసం జట్టులోని 11 మంది ఆటగాళ్లు వందకు వంద శాతం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments