Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

08-11-2022 మంగళవారం దినఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు..

Advertiesment
Daily Horoscope
, మంగళవారం, 8 నవంబరు 2022 (04:00 IST)
మేషం :- కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. దైవ, శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. రహస్య విరోధులు అధికం కావడంవల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. తరుచు సన్మానాలు, సభల్లో పాల్గొంటారు.
 
మిథునం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు ఏ విషయంలోను ఆసక్తి పెద్దగా ఉండదు. ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు పెరిగే సూచనలున్నాయి. విద్యార్థినులలో భయాందోళనలు అధికమవుతాయి. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు.
 
కర్కాటకం :- స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. కార్యసాధనలో పట్టు, ఓర్పు ముఖ్యమని గమనించండి. ప్రైవేటు చిటాదారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దైవ, శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది చేపట్టిన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.
 
సింహం :- బంధు మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని సమస్యల పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడతాయి. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ఆశాజనకం. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. అయిన వారికి ఆపత్సమయంలో అండగా నిలుస్తారు.
 
కన్య :- ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడితప్పదు. స్త్రీలకు పుట్టింటి మీద ధ్యాస మళ్ళుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఖర్చుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకువస్తాయి.
 
తుల :- ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి. ఖర్చులు, రావలసిన ధనం వసూలులో కించిత్ ఇబ్బంది తప్పదు. శారీరక శ్రమ, విశ్రాంతి లోపం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సంతానం మొండివైఖరి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికం. వైద్య రంగావారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- స్త్రీలకు ఆడంబరాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం శ్రేయస్కరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. విద్యార్థినుల తొందరపాటు తనం వల్ల చికాకులు తప్పవు. రుణ చెల్లింపులు వాయిదా పడతాయి. ప్రతి విషయంలోను ఓర్పు, సఖ్యత అవసరం.
 
మకరం :- విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. ఏ పని చేపట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు త్వరతగతిన పూర్తి చేస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పాత రుణాలను తీరుస్తారు.
 
కుంభం :- వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను ఎదుర్కొంటారు. స్థిరచరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం మంచిది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లుల వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు.
 
మీనం :- బంధు మిత్రులతో మనస్పర్థలు తలెత్తుతాయి. మీ ప్రయాణాలు, కార్యక్రమాలకు స్వల్ప ఆటంకాలెదురవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లోని వారికి వస్తు సామగ్రి, విలువైన పత్రాలు అందజేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-11-2022 చంద్ర గ్రహణం 8 ముఖ్య విషయాలు, ఏంటవి? (video)