Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ రికార్డును బ్రేక్ చేసేందుకు అడుగు దూరంలో భారత్

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (11:59 IST)
పాకిస్థాన్ రికార్డును బ్రేక్ చేసేందుకు భారత క్రికెట్ జట్టు మరో అడుగు దూరంలో నిలిచింది. బుధవారం బెంగుళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగే టీ20 మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టీ20 ఫార్మెట్‌లో అత్యధిక క్లీన్‌స్వీప్‌లు సాధించిన జట్టుగా నిలువనుంది. ప్రస్తుతం దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ దేశాల క్రికెట్ జట్లు తలా 8 వైట్‌వాష్‌లతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ఆఫ్ఘన్‌పై విజయం సాధిస్తే మాత్రం పాకిస్థాన్‌ను భారత్ అధికమించనుంది. 
 
స్వదేశంలో ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20లో భారత్ ఇప్పటికే 2-0 ఆధిక్యంతో ఉంది. బుధవారం బెంగుళూరు వేదికగా జరిగే చివరి టీ20లో భారత్ గెలుపొందితే టీ20 క్రికెట్‌లో భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తుంది. టీ20 ఫార్మెట్‌లో అత్యధిక క్లీన్‌స్వీప్‌‍లు సాధించిన జట్టుగా భారత్ అవతరించనుంది. మరోవైపు, ఈ టీ20 సిరీస్ తర్వాత భారత్ పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. 
 
రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు హాజరుకానున్న కోహ్లీ దంపతులు... బీసీసీఐ పర్మిషన్ 
 
ఈ నెల 22వ తేదీన అయోధ్య నగరంలో జరుగనున్న రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ తన సతీమణితో కలిసి హాజరుకానున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ కోహ్లీకి అనుమతిచ్చింది. ఈ నెల 21వ తేదీన ప్రాక్టీస్ సెషన్ నుంచి కోహ్లీ బయలుదేరి అయోధ్యకు చేరుకుంటారు. ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలతో పాటు... మరికొందరు స్టార్ క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారు. ఇపుడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా చేరారు. 
 
ఈ నెల 22వ తేదీన అత్యంత వైభవోపేతంగా అయోధ్య నగరంలో ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ కోహ్లీకి ఆహ్వాన పత్రిక అందింది. దీంతో ఆయన బీసీసీఐ అనుమతి కోరగా, అందుకు పచ్చజెండా ఊపింది. దీంతో ఈ నెల 21వ తేదీన ప్రాక్టీస్ సెషన్ పూర్తి చేసిన తర్వాత టీమిండియా శిబిరం నుంచి బయలుదేరి మరుసటి రోజు అయోధ్య నగరానికి చేరుకుంటారు. 
 
మరోవైపు, భారత్, ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా, ఆఖరి టీ20 మ్యాచ్ బుధవారం జరుగనుంది. బెంగుళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్ తర్వాత క్రికెటర్లకు రెండు రోజుల పాటు విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఈ నెల 25వ తేదీన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభమవుతుంది.  భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్‌కు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

తర్వాతి కథనం
Show comments