Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సొంతగడ్డపై తడబడిన సఫారీలు - 116 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా

Advertiesment
Arshdeep Singh
, ఆదివారం, 17 డిశెంబరు 2023 (17:15 IST)
సౌతాఫ్రికా జట్టు సొంత గడ్డపై తడబడింది. పర్యాటక భారత్‌తో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. జొహన్నెస్ బర్గ్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ లైనప్‌ను భారత పేసర్ అర్షదీవ్ హడలెత్తించి, ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. మరో ఎండ్‌లో అవేష్ ఖాన్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టాడు. పిప్‌పై స్వింగ్, బౌన్స్ లభించడంతో భారత పేసర్లు పండగ చేసుకున్నారు. 
 
సఫారీ ఇన్నింగ్స్‌లో ఆండిలో ఫెహ్లుక్వాయే ఒంటరిపోరాటం చేయడంతో సఫారీల స్కోరు 100 పరుగులు దాటింది. ఫెహ్లుక్వాయే భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి మూడు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 33 పరుగులు చేశాడు. సఫరీ జట్టు బ్యాటర్లు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. ఓపెనర్ టోనీ డి జోర్జి 28, కెప్టెన్ మార్‌క్రమ్ 12, షంసీ 11 (నాటౌట్) చొప్పున పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 0, వాన్ డర్ డుసెన్ 0, హెన్రిచ్ క్లాసెస్ 6, డేవిడ్ మిల్లర్ 2, మియాన్ ముల్డర్ డకౌట్ అయి చేతులెత్తేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం - సఫారీల తడబాటు