Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

146 యేళ్ల చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డు విరాట్ కోహ్లీ సొంతం

Advertiesment
virat kohli
, శుక్రవారం, 29 డిశెంబరు 2023 (10:17 IST)
భారత క్రికెటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా గత 146 యేళ్ళ చరిత్రలో ఏ ఒక్క ఆటగాడు సాధించని రికార్డును నెలకొల్పాడు. క్రికెట్ ప్రపంచంలో గత 146 యేళ్ల కాలంలో ఏడు వేర్వేరు సంవత్సరాల్లో 2 వేలకు పైగా పరుగులు చేసిన చేసిన ఏకైక ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసి 76 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
అయితే, విరాట్ కోహ్లీ మాత్రం రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఏడు వేర్వేరు క్యాలెండర్ సంవత్సరాల్లో 2 వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు. సెంచూరియన్ పార్క్ వేదికగా భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఇందుకు సాక్ష్యంగా నిలిచింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 82 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఫలితంగా 2023 సంపత్సరంలో కోహ్లీ చేసిన పరుగుల సంఖ్య 2006కు చేరుకుంది. 2014లో 2286, 2016లో 2595, 2017లో 2818, 2018లో 2735, 2019లో 2455 చొప్పున పరుగులు చేశాడు. 1877 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభంకాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు నమోదు చేసిన అధికారిక రికార్డుల్లో ఈ తరహా రికార్డు ఎక్కడా నమోదు కాలేదు. 
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో రాణించడంతో భారత్ ఇన్నింగ్స్ 34 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులతే చెలరేగి ఆడిన డీన్ ఎల్గర్ సఫారీల విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే, కగిసో రబడా, మార్కో యెన్‌సెన్, బర్గర్‌ల పేస్ త్రయం అద్భుత బౌలింగ్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో చెత్తగా ఆడారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ మాత్రం ఒంటరిపోరాటం చేసి 76 పరుగులు చేశాడు. ఇందులో ఓ సిక్సర్, 12 ఫోర్లు ఉన్నాయి. 
 
సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్... పాయింట్ల పట్టికలో పతనం 
 
సౌతాఫ్రికా పర్యటనలో భారత క్రికెట్ జట్టు తొలి టెస్టులో చిత్తుగా ఓడిపోయింది. కేవలం మూడు రోజుల్లోనే భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 34 పరుగులతో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో బాగా దిగజారిపోయింది. నాలుగు స్థానాలు దిగజారి ఐదో స్థానానికి పడిపోయింది. అదేసమయంలో ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. సెంచూరియన్ టెస్టు ఫలితంతో డబ్ల్యూటీసీ పాయింట్లను వెల్లడించారు. 
 
ఈ తాజా ర్యాంకుల ప్రకారం ఆస్ట్రేలియా కంటే కాస్త ముందంజలో ఉన్నప్పటికీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌లో భాగంగా, మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం పాయింట్ల పట్టికలో తారుమారుకానున్నాయి. 
 
డబ్ల్యూటీస పాయింట్ల పట్టికలో ప్రస్తుతం సౌతాఫ్రికా, పాకిస్థాన్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఒక న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇండియా, ఆస్ట్రలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ వరుస స్థానాల్లో నిలిచాయి. కాగా సెంచూరియన్ టెస్టులో భారత్ దారుణమైనరీతిలో ఓటమిపాలైంది. డబ్ల్యూటీసీ 2023-25లో సౌతాఫ్రికాకు ఇదే మొదటి సరీస్ కావడం గమనార్హం. దీంతో ఆ జట్టుకు 12 పాయింట్లు దక్కాయి. పాయింట్ల శాతం అన్ని జట్ల కంటే మెరుగ్గా ఉండటంతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 
 
గత రెండేళ్ల వ్యవధిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలతో భారత్ ఒక టెస్టు మాత్రమే గెలిచింది. ఇంగ్లండ్ ఈ యేడాదే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక 2021లో సెంచూరియన్‌‍లో జరిగిన బాక్సింగ్ డై టెస్ట్ తర్వాత సౌతాఫ్రికాతో ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్‌లో కేప్‍టౌన్ వేదికగా జరగనున్న చివరిదైన రెండో టెస్టులో గెలిచి సిరీస్‍‌ను సమం చేసుకుంటుందా, కనీసం డ్రా చేసుకోగలదా? అనేది వేచిచూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్... పాయింట్ల పట్టికలో పతనం