Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై టీమిండియా సూపర్ విక్టరీ.. కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్.. నరాలు తెగే?

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2022 (19:41 IST)
Kohli
పాకిస్థాన్‌పై టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో సూపర్ విక్టరీని నమోదు చేసుకుంది. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియాదే పైచేయిగా నిలిచింది.  
 
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. 
 
చివరి ఓవర్లో భారత్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా, పాక్ స్పిన్నర్ నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పాండ్యా అవుటవడంతో మైదానం సైలెంట్ అయ్యింది. 
 
కానీ కోహ్లీ ఓ బంతిని సిక్సర్‌గా మలిచి ఒత్తిడిని తగ్గించాడు. ఆ బంతి నోబాల్ కావడంతో ఫ్రీహిట్ లభించగా, కోహ్లీ బౌల్డ్ అయ్యాడు. కానీ బంతి ఫీల్డర్ల నుంచి దూరంగా వెళ్లడంతో కోహ్లీ, కార్తీక్ మూడు పరుగులు తీయడంతో చివర్లో రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. 
 
ఈ దశలో కార్తీక్ అవుట్ కావడంతో క్రీజులోకి అశ్విన్ వచ్చాడు. నవాజ్ ఓ వైడ్ విసరడంతో స్కోర్లు సమం అయ్యాయి. చివరి బంతికి ఒక పరుగు కావాల్సి ఉండగా, అశ్విన్ ఓ లాఫ్టెడ్ డ్రైవ్‌తో విన్నింగ్ షాట్ కొట్టాడు. సీన్ కట్ చేస్తే.... భారత్ గెలిచింది, పాక్ ఓడింది.  
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఏదేమైనా కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌‌లో హైలైట్‌గా నిలిచింది. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2, మహ్మద్ నవాజ్ 2 వికెట్లు తీశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నమో మిసైల్ కొట్టే దెబ్బకు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్‌లో కనబడదు: నారా లోకేష్

పాకిస్థాన్ జిందాబాద్ అనే వారి కాళ్లు నిర్ధాక్షిణ్యంగా విరగ్గొట్టాలి : సీఎం హిమంత

నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ 13 ఏళ్ల విద్యార్థి: 23 ఏళ్ల లేడీ టీచర్ షాకింగ్ న్యూస్

Pawan Kalyan: రైతన్నలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. పవన్ కల్యాణ్ (video)

Aghori లేడీ కాదు, అవాక్కయ్యారా? చంచల్ గూడ జైలుకి అఘోరి శ్రీనివాస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments