ఒక యేడాదిలో వెయ్యి పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్!

Webdunia
సోమవారం, 7 నవంబరు 2022 (16:41 IST)
భారత బ్యాటర్ సూర్యకుమర్ యాదవ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకే యేడాదిలో వెయ్యి పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా పాకిస్థాన్ బ్యాటర్ రిజ్వాన్ తర్వాత ఈ రికార్డు సాధించిన రెండో క్రికెటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 
 
ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడుతున్నాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలకు ప్రేక్షకులు మంత్రముగ్ధులైపోతున్నారు. 
 
తాజాగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ కళ్లు చెదిరే షాట్లతో మెరుపు అర్థ శతకం సాధించి భారత్‌కు ఘన విజయం కట్టబెట్టాడు. ఇప్పటికే టీ20 ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ తాజా ప్రదర్శనంతో మరోమారు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 
 
ఈ యేడాది టీ20 ఫార్మెట్‌లో సూర్య వెయ్యి పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేసిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు. పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ మొదటి స్థానంలో నిలిచాడు.
 
ఈ యేడాది ఇప్పటివరకు ఆడిన 28 టీ20 మ్యాచ్‌లలో సూర్య కుమార్ యాదవ్ 44.60 సగటుతో 1026 పరుగులు చేశాడు. 2021లో పాకి ఓపెనర్ రిజ్వాన్ 73.66 సగటుతో 1326 పరుగులు చేశాడు. రిజ్వాన్ 1326 పరుగులు చేసేందుకు 983 బంతులు తీసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మాత్రం 550 బంతుల్లో 1026 పరుగులు చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

తర్వాతి కథనం
Show comments