Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ డకౌట్‌తో టెస్టుల్లో అగ్రస్థానానికి స్టీవ్ స్మిత్ (video)

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (16:16 IST)
అంతర్జాతీయ క్రికెట్ టెస్టులో అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్ళీ దక్కించుకున్నాడు. కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడాతో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు. 
 
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. అదీ కూడా తొలి బంతికే కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇది కోహ్లీ ర్యాంకులపై తీవ్ర ప్రభావం చూపింది.
 
ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ కావడంతో స్టీవెన్ స్మిత్ అగ్రస్థానానికి ఎగబాకాడు. స్మిత్ టెస్టుల్లో మొదటి స్థానానికి చేరడం ఒక యేడాది తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. బాల్ టాంపరింగ్ ఆరోపణలపై స్మిత్ ఒక యేడాది పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెల్సిందే. 
 
కాగా, విరాట్ కోహ్లీ, స్వీట్ స్మిత్‌లు పోటీపడుతున్నారు. కెరీర్ పరంగా కోహ్లీ 79 మ్యాచ్‌లు ఆడి 6749 రన్స్ చేస్తే, స్టీవ్ స్మిత్ మాత్రం 66 మ్యాచ్‌లు ఆడి 6577 రన్స్ చేశాడు. ఇందులో తలా 25 సెంచరీలు చేసివున్నారు. అలాగే, కోహ్లీ సగటు 53.14 శాతం ఉంటే, స్మిత్ సగటు 63.24 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments