Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై స్నేహితుడు అత్యాచారం చేశాడని క్రికెటర్‌పై నిషేధం

శ్రీలంక క్రికెట్ బోర్డు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఓపెనర్ ధనుష్క గుణతిలకే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో అతడిపై 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దక్షణాఫ్రికా జట్టుతో జరిగిన రెండవ టెస్ట్‌లో అతని చర్యలని సీరియస్‌గా పరిగ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (18:44 IST)
శ్రీలంక క్రికెట్ బోర్డు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు ఓపెనర్ ధనుష్క గుణతిలకే ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడంతో అతడిపై 6 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దక్షణాఫ్రికా జట్టుతో జరిగిన రెండవ టెస్ట్‌లో అతని చర్యలని సీరియస్‌గా పరిగణించింది. ఆ టెస్టుకి సంబంధించిన ఫీజులు, బోనస్ మొత్తాలను ఇవ్వలేదని ప్రకటించింది. 
 
ఇప్పటికే అక్టోబర్ 18, 2017లో ప్లేయర్ కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించి మూడు మ్యాచ్‌ల నిషేధం ఎదుర్కొంటున్న గుణతిలకే మరోసారి నిబంధనలను అతిక్రమించడం వలన మరో మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌కి గురైయ్యాడు. గుణతిలకే బస చేసిన హోటల్‌లో అతడి స్నేహితుడొకరు నార్వే మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి అతడిపై దర్యాప్తునకు ఆదేశించింది.
 
శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రవర్తనా నియమావళిని పలుమార్లు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకుంది. అయితే కొసమెరుపు ఏంటంటే దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అతడు చక్కటి ప్రదర్శన కనబరిచాడు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments