Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ పుట్టించిన భార్య... ఎందుకో తెలుసా?

విలాసవంతమైన జీవితం కోసం కొంతమంది ఎంతటి దారుణాలకైనా తెగబడుతుంటారు. ఇందుకు నిదర్శనమే ఈ ఉదంతం. తన భర్త బ్రతికి వుండగానే డెత్ సర్టిఫికేట్ పుట్టించడమే కాకుండా ఆ సర్టిఫికెట్ పెట్టి హోమ్ లోన్ కూడా తీసుకుంది ఓ మహిళ. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

Advertiesment
Shocking
, బుధవారం, 25 జులై 2018 (20:49 IST)
విలాసవంతమైన జీవితం కోసం కొంతమంది ఎంతటి దారుణాలకైనా తెగబడుతుంటారు. ఇందుకు నిదర్శనమే ఈ ఉదంతం. తన భర్త బ్రతికి వుండగానే డెత్ సర్టిఫికేట్ పుట్టించడమే కాకుండా ఆ సర్టిఫికెట్ పెట్టి హోమ్ లోన్ కూడా తీసుకుంది ఓ మహిళ. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే... ఆర్మీలో పనిచేసే బ్రిగేష్ గౌతమ్‌తో 1993లో శ్వేతకు పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఐతే శ్వేతకు రానురాను విలాసంగా బ్రతకాలన్న కోరిక పెరిగిపోయింది. దానితో డబ్బు కోసం భర్తను వేధించసాగింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగేది. తన కోర్కెలను నెరవేర్చలేని భర్తతో వుండనంటూ 2015లో అతడి నుంచి విడాకులు తీసుకుంది. 
 
ఐతే పోతూపోతూ ఇంట్లో వున్న ఆస్తి పత్రాలను దొంగిలించుకెళ్లింది. ఆ తర్వాత వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుంది. బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు ఆస్తి భర్త పేరులో వుండటంతో తన భర్త చనిపోయాడంటూ నకిలీ డెత్ సర్టిఫికెట్ తెచ్చి బ్యాంకు అధికారులను నమ్మించింది. బ్యాంక్ లోన్ అయితే తీసుకున్నది కానీ బ్యాంకు ఇ.ఎం.ఐలను కట్టడకుండా ఎగవేసింది. దీనితో బ్యాంకు అధికారులు ఆ ఇంటిని వేలం వేసేందుకు వచ్చారు. వేలంపాట సమయంలో అసలు నిజం బయటపడింది. భర్త బ్రతికి వుండగానే అతడి ఆస్తిని ఇలా చేసినందుకు ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లోనే టాప్... రూ. 10 కోట్లు ఇన్‌కమ్ టాక్స్ పే చేసింది... ఆమె ఎవరు?