Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోణపు సిరీస్‌లో మరో రికార్డు.. శ్రీలంక కెప్టెన్ అదుర్స్

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (18:27 IST)
ముక్కోణపు సిరీస్‌లో మరో రికార్డు నమోదైంది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా శతకంతో చెలరేగి అరుదైన ఫీట్‌ను సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సాధించగా, రోజు వ్యవధిలోనే మరో రికార్డు నమోదైంది. మహిళల జట్టు నుంచి శ్రీలంక కెప్టెన్‌ చమరి ఆటపట్టు కూడా మూడంకెల స్కోరును సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 
 
ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక మహిళా జట్టు ఓపెనర్‌ చమరి ఆటపట్టు (66బంతుల్లో 12ఫోర్లు, 6 సిక్సర్లతో 113) సెంచరీతో మెరిశారు. అయితే ఆమె ఒంటరి పోరాటం చేసిన లంక 41 పరుగులుతో ఓటమి పాలైంది.
 
అంతకుముందు రోజు అంతర్జాతీయ టీ20 ఫార్మట్‌లో ఛేజింగ్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా పరాస్‌ ఖడ్కా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఖడ్కా తర్వాత చమరి ఆటపట్టు శతకం సాధించడంతో టీ20ల్లో మరో రికార్డు చేరింది. అలాగే ఈరెండు జట్ల తరుపున కూడా శతకాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments