Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాదాకు అభినందనలు... గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుంది.. యూవీ

Webdunia
ఆదివారం, 20 అక్టోబరు 2019 (10:16 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న బెంగాల్ దాగా సౌరవ్ గంగూలీకి భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభినందనలు తెలిపాడు. అంతేకాకుండా, దాదాను పొగడ్తల్లో ముంచెత్తేశాడు. ఓ గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుందంటూ అభిప్రాయపడ్డాడు. 
 
ఇదే అంశంపై యూవీ ఓ ట్వీట్ చేస్తూ, "ఓ గొప్ప వ్యక్తి ప్రస్థానం మరింత గొప్పగా ఉంటుంద''ని అభిప్రాయపడ్డాడు. అయితే, కొన్నాళ్ల కిందట భారత క్రికెట్‌లో యోయో టెస్టు ప్రవేశపెట్టినప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యుంటే ఎంతో బాగుండేదని వ్యాఖ్యానించాడు. 
 
ఎందుకంటే, యోయో టెస్టుపై ఆటగాళ్ల దృక్కోణం నుంచి ఆలోచించగల వ్యక్తిగా గంగూలీ సరైన నిర్ణయం తీసుకుని ఉండేవాడని యువరాజ్ పేర్కొన్నాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా సరికొత్త పదవి చేపడుతున్న సందర్భంగా దాదాకు యువీ శుభాకాంక్షలు తెలిపాడు.
 
మరోవైపు, బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించకముందే సౌరవ్ గంగూలీ ప్రాబల్యం విస్తరిస్తోంది. ఆయనకు భారత క్రికెట్‌లోని అన్ని వర్గాలు మద్దతిస్తున్నాయి. ఆటలో, మైదానంలో ఎంతో దూకుడుగా ఉండే గంగూలీ, రిటైర్మెంట్ తర్వాత క్రికెట్ వ్యవహారాల్లో పరిణతితో కూడిన పాలనాదక్షత కనబరుస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు ఎవరూ ఊహించని విధంగా బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోబోతున్నా, గంగూలీ సామర్థ్యంపై ఎవరికీ సందేహాల్లేవు. పలువురు భారత మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సచిన్, సెహ్వాగ్, యూవీ, ద్రవిడ్ వంటి మేటి క్రికెటర్లు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments