Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశాంత్‌పై సచిన్ స్పందించాడు.. నేనెప్పుడూ టాలెంట్ ఉన్న బౌలర్‌గా..?

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (10:55 IST)
sachin
కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ రిటైర్మెంట్‌పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. శ్రీశాంత్‌ను తానెప్పుడూ టాలెంట్ ఉన్న బౌలర్‌గానే చూశానని సచిన్ పేర్కొన్నాడు. అదే విధంగా భారత్‌కు ఆరేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించినందుకు కంగ్రాట్స్ చెప్పాడు. 
 
నాగ్‌పూర్ వేదికగా 2005లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా శ్రీశాంత్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక భారత్ తరఫున చివరి మ్యాచ్‌ను 2011 ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఆడాడు. శ్రీశాంత్ తన కెరీర్‌లో 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టి20లు ఆడాడు. 
 
టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టి20ల్లో 7 వికెట్లు తీశాడు. అయితే 2013లో వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో శ్రీశాంత్ కెరీర్ నాశనం అయ్యింది. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ జీవిత కాల నిషేధానికి గురయ్యాడు. 
 
అనంతరం కోర్టుకు వెళ్లిన అతడికి అక్కడ ఊరట లభించడంతో మళ్లీ బంతి పట్టి దేశవాళీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. కేరళ తరఫున ఈ ఏడాది రంజీల్లో ఒక మ్యాచ్ ఆడాడు. మేఘాలయతో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్లు తీశాడు. అయితే వయసు మీద పడటంతో శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

CM Revanth Reddy: మిస్ వరల్డ్ 2025 పోటీలు- పటిష్టమైన భద్రతా చర్యలు

Ahmedabad: అక్రమ బంగ్లాదేశ్ నివాసితులపై కొరడా: అదుపులోకి వెయ్యి మంది (Video)

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

తర్వాతి కథనం
Show comments