పంజాబ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) క్లీన్ స్వీప్ దిశగాసాగుతోంది. ఈ ట్రెండ్ ఫలితాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పందించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు.
ఈ రాష్ట్ర శాసనసభకు మొత్తం 117 సీట్లు ఉండగా, ఆప్ పార్టీ ఏకంగా వందకు పైగా సీట్లను గెలుచుకునే దిశగా సాగుతోంది. ఇప్పటికే 91 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 17 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. గతంలో సాధించిన సీట్ల కంటే ఏకంగా 60 సీట్లలో వెనుకబడివుంది
ఈ ఎన్నికల ఫలితాలపై సిద్ధూ స్పందించారు. పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు. ప్రజా తీర్పు దేవుడు తీర్పు వంటిదని చెప్పారు. ఆప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు తెపారు.
మరోవైపు, పంజాబ్‌లో ఆప్ అఖండమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఢిల్లీకి వెలువరు మరో రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండటం ఇది రెండోసారి. ఇప్పటికే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.