Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉత్పల్ పారికర్

Advertiesment
Utpal Parrikar
, శుక్రవారం, 28 జనవరి 2022 (12:14 IST)
గోవా అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. దీంతో ఈ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత మనోహర్ పారీకర్‌ తనయుడు ఉత్పల్ మనోహర్‌కు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన పనాజీ నుంచి గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, తనకు బీజేపీ టిక్కెట్ ఇవ్వనందుకే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినట్టు చెప్పారు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటికీ భాజపాలో మాత్రం చేరబోనని స్పష్టం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో తన పోరాటం ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, టీఎంసీలపై కాదని ఒక్క బీజేపీపైనే అని చెప్పారు. కాగా, ఆయన పనాజీ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకుముందు ఆయన నామినేషన్ దాఖలు చేసే ముందు మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 
 
తన తండ్రి పోటీ చేసి గెలిచిన పనాజీ నుంచి పోటీ చేసి గెలుపొంది నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలని భావించాను. కానీ, కమలనాథులు తనకు టిక్కెట్ నిరాకరించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ నేత అటానాసియో బాబూష్‌కు మాన్ సెరాటేకు టిక్కెట్ కేటాయించింది. పార్టీ నమ్ముకున్న వారికంటే వలస వచ్చినవారికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను అని ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు ఏఎస్ పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం