క్రికెట్ దిగ్గజాల జాబితాలో చేరిన రవీంద్ర జడేజా

ఠాగూర్
మంగళవారం, 25 నవంబరు 2025 (13:13 IST)
గౌహతి వేదికగా పర్యటక సౌతాఫ్రికా, ఆతిథ్య భారత్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట మంగళవారం కొనసాగుతుండగా, భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డును నెలకొల్పాడు. భారత దిగ్గ బౌలర్లు అనిల్ కుంబ్లే, ఆర్.అశ్విన్‌ల సరసన చేరాడు. 
 
మంగళవారం ఉదయం టెస్ట్ మ్యాచ్ మొదటి సెషన్‌లో రవీంద్ర జడేజా సౌతాఫ్రికా ఓరనర్లు ర్యాన్ రికెల్టన్ (35), ఐడెన్ మార్‌క్రమ్‌ (29)ను ఔట్ చేశాడు. దీంతో అతడు టెస్ట్ క్రికెట్‌లో సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 
 
అతడికంటే ముందు అనిల్‌ కుంబ్లే, జవగల్‌ శ్రీనాథ్‌, హర్భజన్‌ సింగ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం గౌహతిలో జరుగుతున్న టెస్ట్‌.. జడేజాకు దక్షిణాఫ్రికాతో 11వ మ్యాచ్‌. అతడు ఇప్పటివరకు 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసుకున్నాడు. 
 
అయితే దక్షిణాఫ్రికా మీద ఎక్కువ వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా రికార్డ్‌ మాత్రం అనిల్‌ కుంబ్లే పేరు మీద ఉంది. అతడు 21 టెస్ట్‌ మ్యాచుల్లో 84 వికెట్లు తన సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే బుమ్రా సైతం 50 వికెట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడు 10 మ్యాచుల్లో 46 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుఫానుగా మారనున్న అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

పాఠాశాల ఐదో అంతస్థు నుంచి దూకేసిన పదవ తరగతి బాలిక.. కారణం ఏంటి?

బెంగుళూరులో ఆంధ్రా విద్యార్థిని దారుణ హత్య

'నిన్ను గర్భవతిని చేయాలి... మన బిడ్డ కావాలి' : మహిళతో ఎమ్మెల్యే సంభాషణ

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments