గౌహతి వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులకు ఆలౌట్ అయ్యారు. సఫారీ ఆటగాళ్లలో ముత్తుసామి సెంచరీ చేసాడు. తొలి రోజు స్కోరు 247/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ 25 పరుగులతో ఆటను కొనసాగించిన ముత్తుసామి (109; 206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతనికిది తొలి శతకం కావడం విశేషం.
తొమ్మిదో స్థానంలో వచ్చిన మార్కో యాన్సెన్ (93; 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యాన్సెన్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. కైల్ వెరినె (45; 122 బంతుల్లో) రాణించాడు. తొలి రోజు ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41), మార్‌క్రమ్ (38), రికెల్‌టన్ (35) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.