Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

Advertiesment
60 Lakh Grant to 50 Artists

ఐవీఆర్

, శనివారం, 22 నవంబరు 2025 (19:47 IST)
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) సిఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్), తమ ఆర్ట్ ఫర్ హోప్-సీజన్ 5 కార్యక్రమానికి 50 మంది గ్రాంటీలను ఈ రోజు ప్రకటించింది. భారతదేశపు విభిన్న కళారంగాన్ని ప్రోత్సహించాలన్న తమ నిబద్ధతను దీనిద్వారా పునరుద్ఘాటించింది. ఈ సంవత్సరం ఎంపిక... ప్రాంతీయ గొప్పదనానికి, సమ్మిళితత్వానికి, ఆవిష్కరణలకు అద్దం పడుతోంది, 22 ప్రాంతాలకు చెందిన కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు.
 
ఈ ప్రోగ్రామ్ యొక్క 5వ సీజన్‌కు దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల(రాష్ట్రాలు+కేంద్రపాలిత ప్రాంతాలు) నుండి, పట్టణ నగరాల నుండి మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల వరకు దరఖాస్తులు అందాయి. కమ్యూనిటీ భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లేని గళాలు, అట్టడుగు వర్గాల సమిష్టితను ప్రతిబింబించే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
 
ఈ సందర్భంగా హెచ్ఎంఐఎల్, ఏవిపి-వెర్టికల్ హెడ్-కార్పొరేట్ అఫైర్స్, కార్పొరేట్ కమ్యూనికేషన్- సోషల్, శ్రీ పునీత్ ఆనంద్ మాట్లాడుతూ, ఆర్ట్ ఫర్ హోప్-సీజన్ 5 ద్వారా, హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ తమ నిబద్ధతను మరోసారి చాటుకుంటోంది. తమ కళ ద్వారా చర్చకు, సామాజిక అవగాహనకు, సమ్మిళితత్వానికి తెరతీసే కళాకారులకు సాధికారత కల్పించడమే మా లక్ష్యం. ఈ సీజన్... భారతదేశపు సృజనాత్మక వైవిధ్యానికి అద్దం పడుతోంది. గ్రామీణ సముదాయాలు, గిరిజన కథకులు, పట్టణ ఆవిష్కర్తలు, డిజిటల్ సృష్టికర్తల ప్రతిభను ఇది వేడుక చేస్తోంది. ఈ 50 ఉత్తమ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం ద్వారా, హెచ్ఎంఐఎఫ్... మన వారసత్వాన్ని కాపాడే, వెలుగులోకి రాని కథనాలను వినిపించే, పరివర్తనాత్మక మార్పుకు స్ఫూర్తినిచ్చే గళాలను ప్రోత్సహిస్తోంది. సృజనాత్మకతకు ఒక లక్ష్యం తోడయ్యే వేదికగా ఈ కార్యక్రమం నిలుస్తుంది. ఇక్కడ కళ... సానుభూతికి, సమానత్వానికి, పురోగతికి వారధిగా మారుతుంది.
 
ఆర్ట్ ఫర్ హోప్-సీజన్ 5 గ్రాంటీలను ఎంపిక చేసేందుకు ఒక ఉన్నత స్థాయి జ్యూరీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ జ్యూరీలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ గాయకులు పండిట్ సజన్ మిశ్రా, ప్రఖ్యాత ఎక్స్‌పీరియెన్షియల్ డిజైనర్ శ్రీ ఆకిబ్ వానీ, అవార్డు గ్రహీత కంటెంట్ క్రియేటర్ (ఆటోమొబైల్, లగ్జరీ, లైఫ్‌స్టైల్) శ్రీమతి గరిమా అవతార్, టెక్నాలజీ, లైఫ్‌స్టైల్, ఆటోమోటివ్ రంగాల్లో నైపుణ్యం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ నిఖిల్ చావ్లా, మ్యూజియో కెమెరా (సెంటర్ ఫర్ ఫోటోగ్రాఫిక్ ఆర్ట్స్) వ్యవస్థాపక ట్రస్టీ-డైరెక్టర్ శ్రీ ఆదిత్య ఆర్య ఉన్నారు. ప్రతి ప్రాజెక్టును దాని కళాత్మక విలువ, కొత్తదనం, ఆవిష్కరణ, సామాజిక ప్రభావం ఆధారంగా అంచనా వేశారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా, గ్రాంట్లు పొందినవారికి నిపుణులతో మెంటర్‌షిప్, నైపుణ్యాలను పెంచే వర్క్‌షాప్‌లు, ప్రాంతీయ ప్రదర్శనలలో అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్ట్ ఫర్ హోప్-సీజన్ 5 ప్రయాణం 2026 ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగే ఒక గ్రాండ్ పబ్లిక్ షోకేస్‌తో ముగుస్తుంది. సృజనాత్మకత, సామాజిక ప్రభావానికి ఒక వేడుకగా ఈ కార్యక్రమం కళ, చర్చ, సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమో భారత్ రైళ్లు, స్టేషన్‌లలో పుట్టినరోజు, ప్రీ-వెడ్డింగ్ షూట్లను జరుపుకోవచ్చు..