Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవన్నీ తప్పుడు వార్తలు.. ఖండిస్తున్నా : రాహుల్ ద్రావిడ్

Webdunia
బుధవారం, 11 మే 2022 (10:22 IST)
తాను హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరుగనున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి హాజరుకాబోతున్నట్టు వచ్చిన వార్తలను భారత మాజీ క్రికెటర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తోసిపుచ్చారు. అవన్నీ నిరాధారమైన వార్తలని స్పష్టం చేశారు. ఈ నెల 12 నుంచి 15వ తేదీల మధ్య ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమీిటీ సమావేశం జరుగనుంది. ఇందులో రాహుల్ ద్రావిడ్ కూడా పాల్గొననున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. 
 
వీటిపై ద్రావిడ్ స్పందిస్తూ, ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదు. తాను ఆ కార్యక్రమానికి హాజరుకావడం లేదని స్పష్టంచేస్తున్నా. ఆ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పారు.
 
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. గత 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 44, కాంగ్రెస్ పార్టీకి 21 సీట్లు రాగా, ఇతరులకు మూడు సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర్మశాల వేదికగా బీజేపీ యువ మోర్ఛా జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

తర్వాతి కథనం
Show comments