ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎ. 2కు చెందిన ఆరు కేసులు తెలంగాణ నమోదైనాయి. జనవరి- మార్చి మధ్య, దక్షిణాఫ్రికాలో మొదటిసారి సీక్వెన్స్ చేయబడిన ఎల్452ఆర్ ఓమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో సుమారు 57 కేసులు నమోదైనాయి. వీటిలో తెలంగాణలో ఆరు, ఏపీలో 11, కర్ణాటకలో 18 నమోదైనాయి.
ఇకపోతే..ఒమిక్రాన్ యొక్క వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోగల ఈ కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ కేసులు దేశంలో అక్కడక్కడ నమోదవుతూనే వున్నాయి. ఒమిక్రాన్-ఎల్ 452ఆర్ చాలా ప్రమాదకరమైన వేరియంట్ అని తాజా అధ్యయనంలో తేలిందని డాక్టర్ డింగ్ చెప్పారు. . బిఎ.2 ప్లస్ ఎల్ 452ఆర్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది.
రాబోయే వారాల్లో, ఇలాంటి మరిన్ని ఒమిక్రాన్ వేరియంట్లు కనిపిస్తాయని, వాటిలో ప్రతిదాన్ని ట్రాక్ చేయడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఎనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు సూచిస్తున్నారు.