ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. భారీ అగ్నిప్రమాదంలో ఆవులు మంటల్లో కాలిపోయాయి. ఈ విషాదకర ఘటన యూపీలోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కనవాణి అనే గ్రామంలో జరిగింది. డంప్‌యార్డులో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న గోశాలకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 38 మంది ఆవులు చనిపోయాయి.
ఈ ప్రమాదంపై శ్రీకృష్ణ గోశాల ఆపరేటర్ సూరజ్ పండిట్ మాట్లాడుతూ, గోశాల పక్కనే ఉన్న డంప్‌యార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, ఈ మంటలు క్షణాల్లో వ్యాపించి గోశాల పూర్తిగా దగ్ధమైపోయిందని తెలిపారు. దీంతో గోశాలలో ఉన్న 150 ఆవుల మందలో 38 ఆవులు మంటల్లో కాలిపోయినట్టు వివరించారు.
ఈ ప్రమాద వార్త తెలుసుకోగానే పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అలాగే, ప్రమాదంపై లోతుగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.