పెర్త్ వన్డే మ్యాచ్ : ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన భారత్

ఠాగూర్
ఆదివారం, 19 అక్టోబరు 2025 (17:50 IST)
పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా బ్యాటర్లు సమిష్టిగా చేతులెత్తేయడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఏడు వికెట్లు తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు. 
 
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 46, జోష్‌ ఫిలిప్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 37, రెన్ షా 21 చొప్పున పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ (8)ని అర్ష్‌దీప్ వెనక్కి పంపగా.. మాథ్యూ షార్ట్ (8)ని అక్షర్ ఔట్ చేశాడు. సుందర్‌ బౌలింగ్‌లో ఫిలిప్ పెవిలియన్ చేరాడు. రెండో వన్డే గురువారం జరగనుంది.
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌ల 38 పరుగులుచేసి జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి  ఫర్వాలేదనిపించాడు. మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ డకౌట్‌ కాగా.. రోహిత్‌ శర్మ ఎనిమిది పరుగులు, ప్రస్తుత సారథి శుభమన్ గిల్‌ పది, శ్రేయాస్ అయ్యర్ 11, వాషింగ్టన్ సుందర్ 10, నితీశ్ రెడ్డి 19 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్‌కు చెరో వికెట్ దక్కింది. కాగా, 2026 సంవత్సరంలో భారత జట్టు ఖాతాలో తొలి వన్డే మ్యాచ్ ఓటమి ఎదురైంది. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా?

కర్నూలు ప్రమాదంపై రాష్ట్రపతి - ప్రధాని - బాబు - పవన్ తీవ్ర దిగ్బ్రాంతి

కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్భ్రాంతి.. రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా

Tamil Nadu: కన్నతల్లినే హత్య చేసిన కొడుకు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments