Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

Advertiesment
Pakistan defence minister

ఐవీఆర్

, శుక్రవారం, 17 అక్టోబరు 2025 (20:13 IST)
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు సాగుతున్నాయి. పాకిస్తాన్ దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆఫ్ఘన్ ఆరోపిస్తుండగా దానికి భారత్ మద్దతిస్తోంది. ఇలా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో దగ్గరవ్వడంతో పాకిస్తాన్ ఉలికిపాటుకు గురవుతోంది. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా నోటికొచ్చిన చెవాకులు పేలారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
భారతదేశ సరిహద్దు వద్ద కూడా ఇలాంటి ఉద్రిక్తతలు ఎదురైతే ఏం చేస్తారంటూ పాక్ యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... ఆ విషయాన్ని కొట్టి పారేయలేం. ఐతే ఈ రెండు దేశాలతో యుద్ధం చేయగల సత్తా మాకు వుంది. ఆ వ్యూహాలు మాకు వున్నాయి. ఐతే వాటి గురించి ఇప్పుడు నేను మాట్లాడను. పాకిస్తాన్ దేశం పైన దాడులు జరిగినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారతదేశంలో వున్నారు. భారతదేశం ఆదేశాల మేరకే ఆఫ్ఘన్ తమపై దాడులు చేస్తోందంటూ విచిత్ర వాదన చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2026 కోసం అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తులను కోరిన అశోకా యూనివర్శిటీ