ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍లో భాగంగా, పెర్త్ వేదికగా ఆదివారం ఉదయం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నాలుగో ఓవర్ నాలుగో బంతికే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (8)వికెట్‌ను కోల్పోయింది.
హేజిల్ వుడ్ బౌలింగ్‌లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు కుర్రోడు నితీశ్ కుమార్ రెడ్డి కూడా అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ గాయపడటంతో ఓపెనర్ మిచెల్ మార్ష్ జట్టకు సారథ్యం వహించాడు.
కాగా, తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లు శుభమన్ గిల్, మిచెల్ మార్ష్ శనివారం నాడు సిరీస్ ట్రోఫీతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్నాయి.
సిరీస్ పూర్తి షెడ్యూల్
తొలి వన్డే మ్యాచ్ : అక్టోబరు 9 ఆదివారం, పెర్త్ స్టేడియం, పెర్త్
రెండో వన్డే మ్యాచ్ : అక్టోబరు 23, గురువారం, అడిలైడ్ ఓవర్, అడిలైడ్
మూడో వన్డే మ్యాచ్ : అక్టోబరు 25, శనివారం, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ