వెస్టిండీస్‌తో రెండో టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్ట్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ టాస్ గెలవడం ఇదే తొలిసారి. వరుసగా గత 6 మ్యాచ్‌ల్లో గిల్ టాస్ ఓడాడు. ఇంగ్లండ్ పర్యటనతో కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన గిల్.. అక్కడ ఐదు మ్యాచ్‌లకు ఐదింటిలోనూ టాస్ ఓడిపోయాడు.
శుక్రవారం వెస్టిండీస్‌తో ఢిల్లీ వేదికగా ప్రారంభమైన రెండో టెస్ట్‌తో భారత బౌలర్ బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. 93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఇండియన్ పేసర్‌గా నిలిచాడు. బుమ్రాకు ఇది 50వ టెస్ట్ మ్యాచ్.
బుమ్రా ఇప్పటి వరకు 75 టీ20లు, 89 వన్డేలు, 50 టెస్ట్‌లు ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఏడో భారత ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్‌లు బుమ్రా కన్నా ముందున్నారు.