Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఉన్నాడా?

Webdunia
శనివారం, 20 జులై 2019 (10:32 IST)
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై రసవత్తర చర్చ సాగుతోంది. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ తర్వాత ధోనీ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పొచ్చన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే, ధోనీ మాత్రం తన రిటైర్మెంట్‌పై పెదవి విప్పడం లేదు. 
 
కానీ, మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు, బీసీసీఐకు చెందిన మాజీ పెద్దలు మాత్రం తలోవిధంగా స్పందిస్తున్నారు. ఇందులోభాగంగా, బీసీసీఐకు చెందిన మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే.. ధోనీ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు కనుచూపు మేరలో కనిపించడం లేదన్నారు. ధోనీ ఒక గొప్ప ఆటగాడని... నిస్వార్థంగా దేశం కోసం ఆడాడని కితాబిచ్చారు. ధోనీలాంటి వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌కు ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేదన్నారు. లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ నుంచి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకునే మెచ్యూరిటీ ధోనీకి ఉందని బీసీసీఐ సెక్రటరీగా కూడా పని చేసిన జగ్దాలే తెలిపారు. 
 
అలాగే, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే పరిణితి ధోనీకి ఉందన్నారు. సచిన్ టెండూల్కర్ విషయంలో వ్యవహరించిన మాదిరిగానే... ధోనీతో సెలెక్టర్లు మాట్లాడాలని, భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments