నా భర్తను ఐపీఎల్ టోర్నీలో ఆడనివ్వొద్దు : షమీ భార్య

భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ మేరకు ఆమె షమీని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింద

Webdunia
ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (11:40 IST)
భారత క్రికెటర్ మహ్మద్ షమీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన భార్య తాజాగా అతన్ని ఐపీఎల్‌ టోర్నీలో ఆడనివ్వొద్దని కోరింది. ఈ మేరకు ఆమె షమీని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని కలిసి విజ్ఞప్తి చేసింది. ఫ్రాంచైజీ సీఈఓ హేమంత్ దువాని జహాన్ ఇటీవల కలిసింది. 'హేమంత్ ఎదుట నా బాధను వినిపించాను. కుటుంబ సమస్యను పరిష్కరించుకునేంత వరకు షమీని ఐపీఎల్‌లో ఆడనివ్వొద్దని ఆయన్ను కోరాను' అని జహాన్ ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపింది.
 
కాగా, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాటలో ఢిల్లీ డేర్ డెవిల్స్ టీమ్ షమీని రూ.3 కోట్లకు తిరిగి దక్కించుకున్న సంగతి తెలిసిందే. షమీకి పలువురు యువతులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని, అతను తనను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేశాడని జహాన్ గతంలో సంచలన ఆరోపణలు చేసింది. వాటితో పాటు ఆమె చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి మాత్రం షమీకి బీసీసీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, ఈనెల 7వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్

భూగర్భంలో ఆగిపోయిన మెట్రో రైలు - సొరంగంలో నడిచి వెళ్లిన ప్రయాణికులు

వామ్మో, జనంలోకి తోడేలుకుక్క జాతి వస్తే ప్రమాదం (video)

బలహీనపడుతున్న దిత్వా తుఫాను.. అయినా ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్

రాజకీయాల నుంచి రిటైర్ కానున్న ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట.. కుమారుడికి పగ్గాలు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

తర్వాతి కథనం
Show comments