Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవన్నీ అవాస్తవాలే.. మళ్లీ జట్టులోకి వచ్చిన షమీ

తనపై తన భార్య చేసిన మ్యాక్ ఫిక్సింగ్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనంటూ భారత క్రికెటర్ మహ్మద్ షమీ వాదిస్తూ వచ్చాడు. అనుకున్నట్టుగానే షమీ అమాయకుడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు కూడా భావించారు. దీంతో అత

అవన్నీ అవాస్తవాలే.. మళ్లీ జట్టులోకి వచ్చిన షమీ
, గురువారం, 22 మార్చి 2018 (19:31 IST)
తనపై తన భార్య చేసిన మ్యాక్ ఫిక్సింగ్ ఆరోపణలన్నీ అవాస్తవాలేనంటూ భారత క్రికెటర్ మహ్మద్ షమీ వాదిస్తూ వచ్చాడు. అనుకున్నట్టుగానే షమీ అమాయకుడని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పెద్దలు కూడా భావించారు. దీంతో అతనికి మళ్లీ జట్టులో స్థానం కల్పించారు. 
 
షమీ భార్య హసీన్ జహాన్ షమీపై చేసిన మ్యాక్స్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ తేల్చింది. షమీ పాకిస్థాన్‌కు చెందిన ఆలీష్‌బా అనే మహిళ పంపిన డబ్బును లండన్‌కు చెందిన మహ్మద్ భాయ్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడని హసీన్ ఆరోపించింది. 
 
దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) అధ్యక్షుడు నీరజ్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ ఆటగాళ్ల వివరాల జాబితా నుంచి షమీ పేరును తొలగించింది. అయితే కేసు విచారణలో భాగంగా బీసీసీఐ అధికారులు షమీని, హసీన్‌ని, కేసులో హసీన్ పేర్కొన్న వ్యక్తులను విచారించారు. విచారణ పూర్తైన తర్వాత ఏసీయూ  అధికారులు నివేదికను సీఓఏకి సమర్పించారు. 
 
దీంతో షమీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడింది అవాస్తవమని తేలడంతో బీసీసీఐ షమీకి తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చేందుకు అంగీకరింది. గతంలో ఉన్న విధంగానే షమీకి బీగ్రేడ్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ అందించింది. దీని ద్వారా షమీ ఇతర ఆటగాళ్లతో పాటు రూ.3 కోట్లు వేతనం అందుకోనున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హార్దిక్ పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ప్రత్యేక కోర్టు