Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్య అబద్దాలకోరు... ఫిక్సర్‌ను అయితే ఉరితీయండి : మహ్మద్ షమీ

తన భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలపై భారత క్రికెటర్ మహ్మద్ షమీ తొలిసారి స్పందించారు. ఆమె అబద్దాల కోరు అని ఆరోపించారు. తనను రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని హసీన్‌ దాచిందని చెప్పుకొచ్చాడు.

Advertiesment
Mohammed Shami
, శుక్రవారం, 16 మార్చి 2018 (10:36 IST)
తన భార్య హసీన్‌ జహాన్‌ చేసిన ఆరోపణలపై భారత క్రికెటర్ మహ్మద్ షమీ తొలిసారి స్పందించారు. ఆమె అబద్దాలకోరు అని ఆరోపించారు. తనను రెండో పెళ్లి చేసుకున్న విషయాన్ని హసీన్‌ దాచిందని చెప్పుకొచ్చాడు. 
 
ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన ఆయన.. భార్య జహాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'నన్ను ఆమె రెండో పెళ్లి చేసుకున్న విషయం నాకు ముందు తెలియదు. పెళ్లయిన తర్వాతే దాని గురించి తెలిసింది. తన ఇద్దరు కూతుళ్లను అక్క పిల్లలుగా నాకు పరిచయం చేసింది' అని షమీ చెప్పాడు. 
 
ఇకపోతే, పెళ్లయిన తర్వాత హసీన్‌ కోసం ఇప్పటిదాకా రూ.1.5 కోట్లు తాను ఖర్చు చేశానని చెప్పుకొచ్చాడు. తనో అబద్ధాల కోరు. ఆమె నా డెబిట్‌ కార్డుతో షాపింగ్‌ చేసేది. ఇటీవల దుబాయ్‌లో తాను ఏం చేశానో హసీన్‌కు అంతా తెలుసని.. ఆ సమయంలో కూడా తనకు వజ్రం, బంగారం తీసుకురావాలని తనను కోరిందని షమీ చెప్పాడు. 
 
అదేసమయంలో తనపై హసీన్‌ చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపైనా షమీ స్పందించాడు. తాను ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు విచారణలో తేలితే ఉరికి సిద్ధమని ప్రకటించాడు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించే క్రమంలో షమీ కన్నీటి పర్యంతమయ్యాడు. 'నేనెప్పుడూ నిజాయితీగానే ఆడాను. బీసీసీఐ తొందరపడి నా కాంట్రాక్టును రద్దు చేసింది. బోర్డు చేసే విచారణలో నేను నిందితుడినని తేలితే ఉరి తీయండి' అని షమీ ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హసీన్‌కు పెళ్లైందని.. ఇద్దరు పిల్లలున్నారని తెలిసి షాకయ్యా: మహ్మద్ షమీ