Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వస్తిక్ గుర్తును ఇంటి ద్వారంపై అంటిస్తే? ఏమౌతుందంటే?

స్వస్తిక్ గుర్తు విజయాన్ని సంపాదించిపెడుతుంది. వినాయకుని హస్తంలో మంగళసూచకంగా నిలిచే స్వస్తిక్.. గెలుపుకు చిహ్నం. స్వస్తిక్ రంగవల్లికలను ఇంటి ముందు వేయడం ద్వారా ఆ ఇంటి యజమానులకు అనుకున్న కార్యాలు దిగ్వ

Advertiesment
స్వస్తిక్ గుర్తును ఇంటి ద్వారంపై అంటిస్తే? ఏమౌతుందంటే?
, మంగళవారం, 13 మార్చి 2018 (16:12 IST)
స్వస్తిక్ గుర్తు విజయాన్ని సంపాదించిపెడుతుంది. వినాయకుని హస్తంలో మంగళసూచకంగా నిలిచే స్వస్తిక్.. గెలుపుకు చిహ్నం. స్వస్తిక్ రంగవల్లికలను ఇంటి ముందు వేయడం ద్వారా ఆ ఇంటి యజమానులకు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వస్తిక్ అంటే.. అడ్డంకులు లేని సుఖమయ జీవనం అని అర్థం. స్వస్తిక్‌లోని ఎనిమిది గీతలు ఎనిమిది దిశలను సూచిస్తాయి. స్వస్తిక్ చిహ్నంలో మధ్యన వుండే బిందువు ఆత్మ. ఇంట్లో వుండే మన ఆత్మ అన్నీ దిశల్లో వుండే దేవతలను పూజిస్తూ వుండాలనే అర్థాన్ని స్వస్తిక్ చెప్తుంది. 
 
స్వస్తిక్ గుర్తు వేటిని సూచిస్తుందంటే?
నాలుగు వేదాలు - ఋగ్వేదము యజుర్వేదము, సామ, అధ్వరణ వేదాలను ఉద్దేశిస్తుంది. 
దిక్కులు - తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 
నాలుగు యుగాలు - కృతయుగం లేదా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం
యోగాలు నాలు - జ్ఞాన, భక్తి, కర్మ, రాజ యోగాలు 
నాలుగు మూలాలు, ఆకాశం వాయు, నీరు, భూమిని స్వస్తిక్ సూచిస్తుంది. 
 
స్వస్తిక్, ఓం, త్రిశూలం అనే మూడింటిని ఇంటి ప్రధాన ద్వారంపై అంటించి పెడితే ఇంట్లోని దుష్టశక్తులు పారిపోతాయి. అయితే స్వస్తిక్ గుర్తులు, పటాలు పాదాలు తాకేలా వుండకూడదు. స్వస్తిక్‌ను డోర్‌కు అతికించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. ఈతిబాధలుండవు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంకా స్వస్తిక్‌ రంగ వల్లికలు పూజా గదిలో అలంకరించుకుని పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందంతా బంగారమే..!