Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త ఓ మోసకారి... న్యాయం కోసం మద్దతివ్వండి : హసీన్ జహాన్

భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్ ఈ దఫా ఏకంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓ విజ్ఞప్తి చేసింది. తన భర్త ఓ మోసకారి అని.. న్యాయం కోసం తాను చేసే పోరాటంలో తనకు మద్దతు ఇవ

Webdunia
సోమవారం, 19 మార్చి 2018 (12:05 IST)
భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్ ఈ దఫా ఏకంగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓ విజ్ఞప్తి చేసింది. తన భర్త ఓ మోసకారి అని.. న్యాయం కోసం తాను చేసే పోరాటంలో తనకు మద్దతు ఇవ్వాలని ఆమె ప్రాధేయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తాను చెప్పే బాధను వినాలని, అందుకోసం తనకు కొంత సమయం ఇవ్వాలని మమతా బెనర్జీని అభ్యర్థించారు. తాను చాలా చిత్రహింసలు అనుభవించానని, తన బాధను పంచుకునేందుకు తనకు సమయం ఇవ్వాలని సీఎంను కోరారు. 
 
'సీఎం మమతా బెనర్జీ గారికి ఈరోజు నేను రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. మేడమ్, నా పోరాటంలో న్యాయం ఉంది. నా తప్పు లేకుండానే చిత్రహింసలు అనుభవించా. నేను మీ మద్దతు అడగడం లేదు. న్యాయం కోసం నేను చేస్తున్న పోరాటంపై దృష్టి సారించాలని మాత్రమే కోరుతున్నా. మిమ్మల్ని కలవడానికి సమయం ఇవ్వండి. నేను చెప్పేది వినండి. ఆ తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టం. నేను చేస్తున్న అభ్యర్థన ఇదొక్కటే' అంటూ ఆమె ప్రాధేయపడింది. 
 
కాగా, హసీన్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించగా, తాజాగా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం కూడా దర్యాప్తు చేపట్టిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments