కపిల్‌దేవ్ సరసన మహ్మద్ సిరాజ్! 39 యేళ్ల నాటి రికార్డు సమం

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (20:02 IST)
హర్యానా హరికేన్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సరసన భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్ చేరారు. తద్వారా 39 యేళ్లనాటి రికార్డును సమం చేశారు. క్రికెట్ మక్కాగా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లండ్‌లో లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఈ అరుదైన రికార్డును సిరాజ్ నెలకొల్పారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ సంచలన విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు చొప్పున మొత్తం 8 వికెట్లు తీశారు. మొత్తం 126 పరుగులు ఇచ్చాడు. 
 
39 యేళ్ళ క్రితం కపిల్ దేవ్ ఇదేవిధంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీసి 168 పరుగులు ఇచ్చాడు. అలాగే, 2007లో ఆర్పీ సింగ్ ఏడు వికెట్లు తీసి 117 పరుగులు ఇచ్చాడు. 1996లో వెంకటేష్ ప్రసాద్ ఏడు వికెట్లు తీసి 130 రన్స్ ఇచ్చాడు. 2014లో ఇషాంత్ శర్మ ఏడు వికెట్లు 135 పరుగులు ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయ్యో... చిన్నారిని అన్యాయంగా చంపాసారే...

సామూహిక అత్యాచారం చేసి వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసిన కామాంధులు

ఏపీలో వున్న ప్రజలంతా ఉచిత పథకాలతో పనిలేకుండా కుబేరులవుతారు, ఎలాగంటే?

ఆ వైద్య విద్యార్థిని అర్థరాత్రి బయటకు ఎలా వెళ్లింది : సీఎం మమతా బెనర్జీ

లక్నోలో దారుణం : బాలికపై ఐదుగురు కామాంధుల అత్యాచారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి క్రేజీ బిజినెస్ అవుతుందా...

Ram potineni: ఆంధ్ర కింగ్... అభిమాని ప్రేమలో పడితే ఏమయింది...

Thaman: అఖండ 2: తాండవం లో పండిట్‌ శ్రవణ్‌ మిశ్రా, అతుల్‌ మిశ్రా బ్రదర్స్ ఎంట్రీ

RSS sena: అరి చిత్రంపై ఆర్ఎస్ఎస్ సేన డిమాండ్ - మంచు విష్ణు యాక్షన్ తీసుకున్నాడా?

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

తర్వాతి కథనం
Show comments